చికెన్ కుండ బిర్యానీ | కుండ బిర్యానీ | స్పెషల్ రోజులని ఇంకా స్పెషల్గా మార్చేసే రెసిపీనే నా స్టైల్ “చికెన్ కుండ బిర్యానీ”

Non Veg Biryanis | nonvegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 30 Mins
  • Resting Time 30 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ వండుకోడానికి
  • 1/2 Kilo చికెన్
  • 1/4 cup నూనె
  • 1.5 inches దాల్చిన చెక్క
  • 2 నల్ల యాలకలు
  • 4 యాలకలు
  • 5 లవంగాలు
  • 1 అనాసపువ్వు
  • 1/4 tsp పసుపు
  • 1 tsp షాహీ జీరా
  • 1 tbsp కారం
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • ఉప్పు రుచికి సరిపడా
  • 1/2 cup ఉల్లిపాయ చీలికలు
  • 3 పచ్చిమిర్చి (చీలికలు)
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • పుదీనా చిన్న కట్ట
  • కొత్తిమీర చిన్న కట్ట
  • 1/2 cup పెరుగు
  • 1/4 cup నీళ్ళు
  • 1 tbsp నిమ్మరసం
  • అన్నం ఉడికించడానికి
  • 2 liters నీళ్ళు
  • 2 inches దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 3 నల్ల యాలకలు
  • 2 మారాటీ మొగ్గలు
  • 1/4 cup ఉప్పు
  • 1.5 cup బాస్మతి బియ్యం (150 gm)
  • పుదీనా పేస్ట్
  • 5 పచ్చిమిర్చి
  • పుదీనా- చిన్న కట్ట
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 1/4 cup పెరుగు
  • 1 inch అల్లం
  • 6 వెల్లులి
  • 1 tsp నిమ్మరసం
  • ధం కోసం
  • 1/3 cup ఎసరు నీళ్ళు
  • 1/4 cup నెయ్యి
  • కొత్తిమీర – కొద్దిగా
  • 2 tbsp వేపిన ఉల్లిపాయలు
  • 1/4 tsp గరం మసాలా
  • మైదా పిండి ముద్ద

విధానం

  1. కుండలో నూనె పోసి గరిటతో కుండ అంతా నూనెతో తడపండి.
  2. వేడెక్కిన నూనెలో చెక్కా, లవంగాలు ఇంకా మిగిలిన మసాలా దీనుసులన్నీ ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. సగం పైన వేగిన ఉల్లిపాయాలో చికెన్ ముక్కలు, అల్లం వెల్లులి ముద్ద వేసి 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  4. తరువాత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా, పచ్చిమిర్చి వేసి మరో 2 నిమిషాలు ఉడకనిచ్చి తరువాత పుదీనా కొత్తిమీర పెరుగు, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
  5. పుదీనా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  6. ఎసరు కోసం నీళ్ళని మరిగించి అందులో మసాలా దీనుసులన్నీ, ఇంకా పుదీనా పేస్ట్, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి.
  7. మరుగుతున్న ఎసరులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి హై-ఫ్లేమ్ మీద 60% ఉడికించాలి. 60% ఉడికిన అన్నాన్ని వడకట్టి సగం ఉడికిన చికెన్ పైన రెండు పొరలుగా వేసుకోవాలి.
  8. మరో 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద ఉడికిస్తే 70% ఉడుకుతుంది అది ఇంకో లేయర్ గా ఇంకో రెండు నిమిషాలు ఉడికిస్తే 80% ఉడుకుతుంది అప్పుడు దాన్ని ఆఖరు లేయర్ గా అన్నాన్ని వడకట్టి వేసుకోవాలి.
  9. బిర్యానీ పైన ఉడికిన ఎసరు నీళ్ళు పోసుకోవాలి, ఇంకా నెయ్యి బిర్యానీ పైన అంతా పోసుకోవాలి. వేపిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, గరం మసాలా చల్లుకోవాలి
  10. కుండ అంచులకి మైదా పిండి ముద్ద పల్చగా పరిచి గట్టిగా మూత పెట్టి ఒక దగ్గర చిన్న రంధ్రం చేసుకోవాలి
  11. బిర్యానీ కుండని పొయ్యి మీద హై-ఫ్లేమ్ మీద చేసుకున్న రంధ్రం గుండా వేగంగా వచ్చేదాకా ఉడికించాలి.
  12. ఆవిరి వేగంగా వచ్చాక మంట తగ్గించి సిమ్లో మరో 3 నిమిషాలు ధం చేసి స్టవ్ ఆపేసి 30 నిమిషాలు వదిలేయాలి
  13. 30 నిమిషాల తరువాత అడుగు నుండి కలుపుకోవాలి. ఈ బిర్యానీ మిర్చి కా సాలన్, చల్లని పెరుగు పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.