కావాల్సిన పదార్ధాలు
-
చికెన్ స్టాక్ కోసం
-
250
gms చికెన్ ఎముకలు
-
1/2
cup కాప్సికం ముక్కలు
-
1/2
cup కేరట్ ముక్కలు
-
1/4
cup ఉల్లిపాయ ముక్కలు
-
1
బిరియానీ ఆకు
-
1
tsp మిరియాలు
-
1.25
liter నీళ్ళు
-
సాల్నా కోసం
-
1/4
cup పల్లీలు
-
1
tbsp గసగసాలు
-
1
tsp సొంపు
-
1/2
cup పచ్చికొబ్బరి ముక్కలు
-
4
tbsp నూనె
-
1
అనాస పువ్వు
-
3
యాలకలు
-
4
లవంగాలు
-
1
ఇంచ్ దాల్చిన చెక్క
-
1
బిరియానీ ఆకు
-
1.5
cup ఉల్లిపాయలు సన్నని తరుగు
-
ఉప్పు
-
కొత్తిమీర – కొద్దిగా
-
2
tbsp అల్లం వెల్లులి ముద్ద
-
350
gms చికెన్
-
2
టొమాటో
(సన్నని తరుగు)
-
2
పచ్చిమిర్చి
(చీలికలు)
-
1/4
tsp పసుపు
-
1 1/4
tbsp ధనియాల పొడి
-
2 1/4
tsp కారం
-
1
tsp చికెన్ మసాలా పొడి
-
10 - 15
పుదీనా ఆకులు
విధానం
-
స్టాక్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద గంట సేపు మరిగించాలి. 25 నిమిషాల తరువాత స్టాక్ మీద ఒక తేట ఏర్పడుతుంది దాన్ని నెమ్మదిగా తీసేయండి.
-
గంట సేపు మరిగిన స్టాక్లోంచి చికెన్ ఉడికిన కూరగాయ ముక్కలు అన్నీ తీసేసి పడేయండి. మిగిలిన స్టాక్ని పక్కనుంచుకోండి.
-
ముకుడులో పల్లీలు వేసి చిట్లే దాకా వేపుకోవాలి, తరువాత గసాలు వేసి వేపి దింపేసుకోండి
-
మిక్సీ జార్లో వేపిన పల్లీలు, గసాలు పచ్చికొబ్బరి వేసి నీళ్ళతో వెన్నలాంటి పేస్ట్ చేయాలి
-
సాల్నా కోసం నూనె వేడి చేసి అందులో అనాస పువ్వు, చెక్క, సొంపు, లవంగాలు,యాలకలు, బిరియానీ ఆకు వేసి వేపుకోవాలి
-
సన్నని ఉల్లిపాయ చీలికలు, ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసి ఉల్లిపాయలు మెత్తబడి రంగు బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
-
వేపుకున్న ఉల్లిపాయాల్లో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి, తరువాత చికెన్ వేసి హై-ఫ్లేమ్ మీద చికెన్ పైన బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
-
చికెన్ బంగారు రంగులోకి వేగాక టొమాటో తరుగు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు ధనియాల పొడి, కారం వేసి బాగా వేపుకోవాలి.
-
వేగిన మసాలాల్లో పక్కనుంచుకున్న చికెన్ స్టాక్ పోసి నూనె పైకి తేలేదాక సన్నని మంట మీద ఉడికించాలి.
-
15 నిమిషాలకి నూనె పైకి తేలుతుంది అప్పుడు పల్లీలు కొబ్బరి పేస్ట్, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి సన్నని మంట మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి
-
ఆఖరున చికెన్ మసాలా పొడి వేసి కలిపి మరి 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
-
వేడి వేడి పరోటా, చపాతీ, అట్టు ఇడ్లీ , పూరీ ఇలా ఎందులోకైనా ఎంతో రుచిగా ఉంటుంది ఈ చికెన్ షేర్వా.