మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలుపుకుని పనీర్ ముక్కలు వేసి చెంచాతో పొడి పిండి పట్టించండి .
తరువాత నీళ్ళు వేసి పనీర్ కి పిండి పెట్టేలా చెంచాతో లేదా గిన్నె తిప్పుతూ పట్టించండి.
పనీర్ ముక్కలని వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద లైట్ గోల్డెన్ కలర్ ఇనాక్ పై పిండి క్రిస్ప్ అయ్యేదాకా వేపుకుని తీసుకోండి.
పాన్లో నూనె వేడి చేసి అందులో వెల్లూలి, అల్లం, పచ్చిమిర్చి ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయల్ని మెత్తబడే దాక వేపుకోవాలి
ఇప్పుడు ఉల్లిపాయ,కాప్సికం పాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి హై ఫ్లేం మీద 2-3 నిమిషాలు మగ్గనివ్వండి
తరువాత మిగిలిన సాస్లు, పొడులు అన్నీ వేసి నూనె పైకి తేలేదాకా హై-ఫ్లేం మీద కలుపుతూ వేపుకోవాలి.
నూనె పైకి తేలాక 300 ml నీళ్ళు పోసి అందులో హై-ఫ్లేం మీద తెర్ల కాగనివ్వాలి. 2-3 నిమిషాలు మరిగాక పనీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు మరనివ్వాలి.
మరుగుతున్న గ్రేవీలో 1 tbsp కార్న్ ఫ్లోర్ లో 3 tbsps నీరు వేసి కలిపిన నీరు 1.5 tbsps పోసుకుని కలిపి రెండు నిమిషాలు హై ఫ్లేం మీద మరిగిస్తే చిక్కబడుతుంది గ్రేవీ.
గ్రేవీ చిక్కబడగానే అంగుళం సైజు ఉల్లికాడల ముక్కలు వేసి మరో నిమిషం మరిగించి, ఆ తరువాత సన్నని ఉల్లికాడల ముక్కలు చల్లి దింపి సర్వ్ చేసుకోవడమే.