భేల్ పూరి | చైనీస్ భేల్ పూరి | చైనీస్ భేల్ | భేల్ పూరి రెసిపీ

Chinese Veg Recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 30 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1 bundle నూడుల్స్
  • నీళ్ళు (నూడుల్స్ ని ఉడికంచడానికి)
  • ఉప్పు (కొద్దిగా)
  • నూనె (ఉడికిన నూడుల్స్ పైన చల్లుకోడానికి)
  • నూనె (నూడుల్స్ ని వేపుకోడానికి)
  • 5 tbsp కార్న్ ఫ్లోర్
  • వెజ్జీస్ వేపుకోడానికి :
  • 3 tbsp నూనె
  • 1 tbsp వెల్లులి తరుగు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1 tsp అల్లం
  • ¼ cup ఉల్లి చీలికలు
  • ¼ cup కేరట్ చీలికలు
  • ¼ cup ఆకుపచ్చ కాప్సికం
  • ¼ cup పసుపు పచ్చ కాప్సికం
  • 1 ½ cups కేబేజి చీలికలు
  • ఉప్పు (కొద్దిగా)
  • భేల్ తయారీకి:
  • ¼ tsp మిరియాల పొడి
  • ½ tbsp గ్రీన్ చిల్లి సాస్
  • 1 tbsp రెడ్ చిల్లి సాస్
  • 1 tsp చిల్లి ఫ్లెక్స్
  • 3 tbsp వేపిన వేరుశెనగగుండ్లు
  • 2 tbsp ఉల్లికాడలు
  • 1 tbsp టమాటో సాస్
  • ఉప్పు (చిటికెడు)
  • ఉల్లికాడలు (కొద్దిగా)
  • 1 tbsp శేజ్వాన్ సాస్
  • ½ tsp వెనిగర్
  • 1 tsp చైనీస్ చిల్లి పేస్ట్
  • ½ tsp సోయా సాస్

విధానం

  1. మరిగే నీళ్లలో ఉప్పు నూడుల్స్ చుట్ట వేసి హై ఫ్లేమ్ మీద 90% ఉడికించి వెంటనే నూడుల్స్ ని జల్లెడలో వేయాలి.
  2. నూడిల్స్ పైన కొద్దిగా నూనె వేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
  3. చల్లారిన నూడుల్స్ పైన కార్న్ ఫ్లోర్ కొద్దీ కొద్దిగా వేసి బాగా కోట్ చేసుకోవాలి.
  4. కార్న్ ఫ్లోర్ పట్టించిన నూడుల్స్ ని మరిగిన నూనెలో కొద్దీ కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోవాలి.
  5. మరో పాన్లో నూనె వేడి చేసి అందులో అల్లం వెల్లులి తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక నిమిషం వేపుకోండి.
  6. వేగిన వెల్లులిలో ఉల్లి కేరట్ కాప్సికం వేసి మరో నిమిషం వేపుకోండి.
  7. ఆ తరువాత కేబేజి చీలికలు వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి.
  8. పైపైన వేగిన వెజ్జీస్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి దింపేసి ఒక బౌల్ లోకి తీసుకుని చల్లారచండి.
  9. చల్లారిన వెజ్జీస్లో భేల్ కోసం ఉంచిన సాసులు మిగిలిన పదార్ధాలన్నీ వేసి ముందు బాగా టాస్ చేయండి.
  10. ఆఖరుగా వేపిన నూడుల్స్ ని నెమ్మదిగా చిదిమి వెజ్జీస్ పట్టించిన సాసులలో వేసుకోండి.
  11. పైన కాసిన్ని ఉల్లికాడలు చల్లి టాస్ చేసుకుని వెంటనే సర్వ్ చేయండి.