చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. చాక్లెట్ ముక్కలని ఒక బౌల్లో ఉంచి ఆ బౌల్ మరుగుతున్న నీళ్ళ పైన ఉంచి చాక్లెట్ని కరిగించండి. పూర్తిగా కరిగిన చాక్లెట్ని చల్లారనివ్వాలి
బటర్లో చల్లారిన చాక్లెట్ వేసి బాగా కలుపుకోవాలి.
ఎగ్స్ లో పంచదార, వెనీలా ఎసెన్స్ వేసి ఎగ్స్ నూరగనూరగా వచ్చేదాకా బీట్ చేసుకోవాలి.
ఎగ్స్ తెల్లని నూరగగా వచ్చాక చాక్లెట్ మిశ్రమం పోసి నెమ్మదిగా అంతా కలిసేలా కలుపుకోవాలి
జల్లెడలో మైదా, కోకో పౌడర్ వేసి జల్లించాలి. తరువాత కట్ & ఫోల్డ్ మెథడ్లో స్పాటులాతో అంతా కలిసేలా కలుపుకోవాలి.
మౌల్డ్లో బటర్ పేపర్ ఉంచి దాని మీద చాక్లెట్ మిశ్రమం పోసి నెమ్మదిగా తడితే లోపల బుడగలు ఉంటే పోతాయ్
ప్రీ-హీట్ చేసుకున్న ఓవెన్లో కేక్ మౌల్డ్ ఉంచి 170 డిగ్రీల దగ్గర 40 నిమిషాలు లేదా టూత్ పిక్ క్లీన్గా వచ్చేదాకా బేక్ చేసుకోవాలి.
బేక్ అయినా బ్రౌనీని మౌల్డ్ లోనే పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన బ్రౌనీ అంచులని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి.