½
cup చింతపండు పులుసు (నిమ్మకాయంత చింతపండు నుండి తీసినది)
1
tbsp బెల్లం
కొత్తిమీర (కొద్దిగా)
2
tbsp వేపిన నువ్వుల పొడి
విధానం
లేత గోరుచిక్కుడుల ఈనెలు తీసేసి అంగుళం పైన పెద్ద ముక్కలుగా తరుక్కోండి. తరుక్కున గోరుచిక్కుడు ముక్కల్లో నీరు పోసి ఉప్పు వేసి 80% ఉడికించుకోండి. (ముదురు గోరుచిక్కుడుకాయలు వాడితే కుక్కర్లో 2 కూతలు వచ్చేదాకా ఉడికించుకోండి.)
నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు వేసి మెంతులని రంగు మారనివ్వండి. రంగుమారిన మెంతుల్లో ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపుని గుభాళించేలా వేపుకోండి.
వేగిన తాలింపులో ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపుకోండి.
మెత్తబడిన ఉల్లిలో ఉప్పు, కారం, పసుపు వేసి వేపండి ఆ తరువాత గోరుచిక్కుడుని ఉడికించుకున్న నీటితో సహా వేసి కలిపి మిగిలిన 20% ఉడికిస్తే పూర్తిగా ఉడికిపోతాయ్ గోరుచిక్కుడులు.