Moodu pappula Kobbari Pachadi

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • ¼ cup మినపప్పు
  • ¼ cup సెనగపప్పు
  • ¼ cup పెసరపప్పు
  • ¾ cup పచ్చికొబ్బరి
  • 4 tbsp నూనె
  • 20 - 25 ఎండుమిర్చి
  • 5 పచ్చిమిర్చి
  • 12 - 15 వెల్లులి
  • ½ tsp ధనియాలు
  • ¼ tsp జీలకర్ర
  • చింతపండు - నిమ్మకాయ సైజు అంత
  • 1 tbsp బెల్లం
  • నీరు - పచ్చడి బరకగా రుబ్బుకోడానికి
  • తాలింపు కోసం:
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • ½ tso జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • ¼ tsp ఇంగువ
  • 2 sprigs కరివేపాకు

విధానం

  1. నూనె వేడి చేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేపి తీసి పక్కనుంచుకోండి.
  2. మిగిలిన నూనెలో మూడు పప్పులు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
  3. పప్పులు రంగు మారుతూ మాంచి సువాసన వస్తున్నప్పుడు ధనియాలు వెల్లులి వేసి వేపుకోవాలి.
  4. వేగిన పప్పుల్లో పచ్చికొబ్బరి ముక్కలు వేసి వేపుకోవాలి. ఆ తరువాత జీలకర్ర వేసి వేపుకోవాలి.
  5. మిక్సర్ జార్లో ముందుగా వేపుకున్న ఎండుమిర్చి చింతపండు బెల్లం ఉప్పు వేసుకోండి. ఆ తరువాత వేపుకున్న పప్పులు కొబ్బరి నీరు వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి.
  6. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర ఇంగువ కరివేపాకు పసుపు ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి.
  7. వేగిన తాలింపులో బరకగా రుబ్బుకున్న పచ్చడి వేసి కలిపి దింపేసుకోండి.
  8. పచ్చడిలో ఒక వేళా కారం తక్కువగా అనిపిస్తే మిర్చిని విడిగా వేపి గ్రైండ్ చేసి తరువాత కలుపుకోండి.