కొబ్బరి హల్వా | కమ్మగా రుచిగా తిన్నకొద్ది తిన్నలనిపిస్తుంది

Sweets | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 cup పచ్చి కొబ్బరి
  • 1 cup బెల్లం
  • 3 - 4 spoon నీళ్ళు
  • 1/2 tsp యాలకలపొడి
  • 3 tbsp నెయ్యి
  • 10 జీడిపప్పు

విధానం

  1. పచ్చికొబ్బరి తురుము, బెల్లం తరుగు కొద్దిగా నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి
  2. ముకుడులో నెయ్యి కరిగించి జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి
  3. అదే నెయ్యిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గరపడనివ్వాలి
  4. 20 నిమిషాలకి హల్వాలా దగ్గరపడుతుంది. అప్పుడు యాలకలపొడి , మరో tsp నెయ్యి, వేపుకున్న జీడిపప్పు వేసి కలిపి దింపేసుకోవాలి