కొబ్బరి అన్నం | ప్రసాదంగా లేదా లంచ్ బాక్సులకి సింపుల్ రైస్ ఐటం

Breakfast Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 15 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం
  • 1 3/4 liter పలుచని కొబ్బరి పాలు
  • 1/4 cup నీళ్ళు
  • ఉప్పు
  • తాలింపు కోసం
  • 2 tbsps నూనె
  • 15 జీడిపప్పు
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp శెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • కరివేపాకు – ఒక రెబ్బ
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 1 cup పచ్చి కొబ్బరి తురుము (సగం చిప్ప)
  • కొత్తిమీర – కొద్దిగా

విధానం

  1. బియ్యంలో కొబ్బరి పాలు, నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం - ఫ్లేమ్ మీద రెండు హై - ఫ్లేమ్ మీద ఒక విసిల్ రానిచ్చి స్టీమ్ పోనివ్వాలి
  2. స్టీమ్ పోయాక వెంటనే వేడి మీదే ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకోండి
  3. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ముందు జీడిపప్పు వేసి తరువాత ఒక్కోటిగా అన్నీ వేసి ఆఖరుగా కొబ్బరి తురుము వేసి కలిపి 30 సెకన్లు వేపి కొబ్బరి అన్నంలో వేసుకోండి
  4. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి కలిపి సర్వే చేసుకోండి