చేమగడ్డ వేపుడు | కరకరలాడే చేమగడ్డ వేపుడు

Curries | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms చేమదుంపలు
  • 3 tbsp బియ్యం పిండి
  • 1/4 spoon పసుపు
  • 1 tsp కారం
  • ఉప్పు
  • 1/2 tsp ఆమ్చూర్ పొడి
  • నూనె- వేయించడానికి సరిపడా
  • తాలింపుకి
  • 2 tsp నూనె
  • 3 దంచినవి వెల్లూలి
  • కరివేపాకు- ఓ రెబ్బ
  • 1/2 tsp ఆవాలు, జీలకర్ర, మినపప్పు
  • 2 ఎండు మిర్చి
  • 1 tsp సాంబార్ కారం/కూర కారం

విధానం

  1. చేమదుంపల్ని కడిగి కుక్కర్ లో పెట్టి హై ఫ్లేమ్ మీద ఒకే విసిల్ రానిచ్చి పొట్టు తీసి ఉంచుకోండి
  2. ఉడికిన్చుకున్న దుంపల్ని అర అంగుళం ముక్కలు గా ( చక్రాల్లా) కట్ చేసుకోండి
  3. వెడల్పాటి గిన్నె దుంప ముక్కల్ని వేసి సగం బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ఆంచూర్ పొడి వేసి చిదిరిపోకుండా నెమ్మదిగా పట్టించండి ముక్కలు
  4. మిగిలిన బియ్యం పిండి, కొద్దిగా నూనె వేసి దుంపలకి మళ్ళీ పట్టించండి. దీని వల్ల మరింత కరకరలాడుతూ వస్తాయి
  5. వేడి వేడి నూనె లో చేమగడ్డ ముక్కలు వేసి కదపకుండా 2 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత నెమ్మదిగా కదుపుతూ మీడియం ఫ్లేం మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి.
  6. ఆ తరువాత హై ఫ్లేం మీద ఎర్రగా కరకరలాడేలా బంగారు రంగు వచ్చేదాకా వేపుకుంటే చాలు.
  7. ఆఖరుగా తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు సామానంతా వేసి వేయించుకుని వేపుకున్న దుంపలు వేసి పైన సాంబార్ కారం వేసి బాగా పట్టించి దింపేసుకోండి.