ఎగ్ బోండా

Street Food | nonvegetarian|eggetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 10 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 6 ఉడికించిన గుడ్లు
  • బజ్జీ పిండి కోసం
  • 3/4 cup సెనగపిండి
  • 1/8 tsp పసుపు
  • ఉప్పు
  • 2 చిటికెళ్ళు వంట సోడా
  • 1/4 tsp జీలకర్ర
  • 1 tsp సన్నని పచ్చిమిర్చి తురుము
  • 1 tsp కొత్తిమీర తరుగు
  • 1/2 tsp కారం
  • 1/8 tsp చాట్ మసాలా
  • 1/4 tsp గరం మసాలా
  • 1/4 tsp వేయించిన జీలకర్ర పొడి
  • నీళ్లు - తగినన్ని

విధానం

  1. ఉడికించిన గుడ్లని సగానికి కట్ చేసి పక్కనుంచుకోండి.
  2. సెనగపిండిలో పిండి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి చిక్కగా పిండి కలుపుకోవాలి.
  3. కట్ చేసిన గుడ్డు లోపలి పచ్చ సోన చిదిరిపోకుండా పిండిలో ముంచి తీసి మరిగే వేడి నూనె వేసి మీడియం - హై -ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోండి.
  4. సర్వ్ చేసే ముందు చాట్ మసాలా చల్లి ఉల్లిపాయ తరుగుతో వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.