ఆలూ ఫ్రై | బంగాళాదుంప వేపుడు | సింపుల్ ఆలూ ఫ్రై రెసిపి కొత్తగా నా స్టైల్లో చేయండి

Veg Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 30 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kg బంగాళాదుంపలు
  • 1/2 tsp మెంతులు
  • 2 ఎండు మిర్చి
  • 1/2 cup నూనె
  • 1 cup మెంతికూర తరుగు
  • 1 tbsp కారం
  • ఉప్పు
  • 1 tbsp ధనియాల పొడి

విధానం

  1. నూనె వేడి చేసి 30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన ఆలూ గడ్డ ముక్కులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ముక్కలు ఎర్రబడ్డాక తీసుకోండి.
  2. అదే నూనెలో మెంతులు ఎండుమిర్చి వేసి మెంతులు ఎర్రబడేదాకా వేపుకోవాలి.
  3. మెంతికూర తరుగు వేసి 2 నిమిషాలు వేపితే పసరు వాసన పోయి మెత్తగా వేగుతుంది.
  4. తరువాత ఆలూ గడ్డ ముక్కలు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
  5. వేపుడు తయారయ్యాక గిన్నెలోకి తీసి జల్లెడతో కప్పి ఉంచుకుంటే క్రిస్పీగా వేగిన ఆలూ మెత్తబడదు.
  6. ఈ వేపుడు వేడిగా నెయ్యి వేసుకుని తిన్నా సాంబార్, రసం, పెరుగన్నం తో నంజుడిగా కూడా చాలా బాగుంటుంది.