అటుకులని జల్లించి నీళ్లతో బాగా తడిపి 15 నిమిషాలు వదిలేస్తే అటుకులు బాగా మెత్తబడతాయ్. తరువాత చేత్తో బాగా మెత్తగా నిలపాలి.
తరువాత మెత్తగా ఉడికించిన ఆలూని తురుము వేసుకుంటే గడ్డలు ఉండవు.
కట్లెట్స్ కోసం ఉంచిన మిగిలిన సామాగ్రీ అంతా వేసి గట్టిగా పిండుతూ కలుపుకోండి
మైదాలో నీరు, కొద్దిగా ఉప్పు వేసి పలుచని మజ్జిగ మాదిరి చేసుకోండి, సెనగపిండిలో ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకోండి. సేమియాని నలిపి పక్కనుంచుకోండి
కలుపుకున్న కట్లెట్స్ మిశ్రమంని నచ్చిన ఆకారంలో తట్టుకొండి.
తరువాత ముందు మైదాలో కట్లెట్ తడిచేలా ముంచి ఆ తరువాత సెనగపిండిలో రోల్ చేయండి అప్పుడు తడిపొడిగా ఉంటుంది కట్లెట్, ఆ సమయంలో సేమియాలో రోల్ చేసి అవసరమైతే సేమియాని అంటించండి కట్లెట్కి
మరిగే వేడి నూనె మంట తగ్గించి తయారు చేసుకున్న కట్లెట్స్ కొన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా 2 నిమిషాలు వదిలేయండి, ఆ తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ వేపుకోవాలి
ఈ కట్లెట్స్ వేడి పుదీనా పచ్చడి టమాటో సాస్తో చాలా రుచిగా ఉంటుంది.