నూనె లో ఉడికించిన ఆలూ వేసి ఆలూ పైన ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఆలూ రంగు మారుతుండగా ఇంగువ , ఉప్పు , మిరియాల పొడి వేసి ఎర్రగా వేపి ఆలూని పక్కకు తీసుకోండి.
అదే మూకుడులో 2 tbsp నూనె వేడి చేసి అందులో జీలకర్ర, కలోనజీ వేసి వేపుకోవాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి.
ఉల్లిపాయ లేత గులాబీ రంగులోకి మారగానే అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి.
తరువాత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
తరువాత టొమాటో పేస్ట్ వేసి టొమాటో వేగి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి. తరువాత వేపుకున్న ఆలూ వేసి 3 నిమిషాలు వేపుకోవాలి.
స్టవ్ ఆపేసి చిలికిన పెరుగు వేసి కూరలో కలిసేదాకా బాగా కలిపి, తరువాత స్టవ్ ఆన్ చేసి సన్నని సెగ మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాక కూరని ఉడికించాలి.
నూనె పైకి తేలాక కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి.