దహి బల్లా | చాట్ బండి దగ్గర దొరికే మృదువైన దహీ భల్లా
Snacks
|
vegetarian
Prep Time30 Mins
Resting Time60 Mins
Servings6
కావాల్సిన పదార్ధాలు
దహీ భల్లా కోసం
1/2
liter పెరుగు
1/4
cup పంచదార
1
cup మినపప్పు
ఉప్పు
1
tsp సొంపు
2
tbsp జీడిపప్పు పులుకులు
10
ఎండు ద్రాక్ష తరిగినవి
1/4
tsp వంట సోడా
నీళ్ళు – కొద్దిగా
నూనె వేపడానికి
చల్లని నీళ్ళు బొండాలు నానబెట్టడానికి
1
tsp వేయించిన జీలకర్ర పొడి
1
tsp కారం
కొత్తిమీర – చిన్న కట్ట
1/2
cup నైలాన్ సేవ్
పుదీనా చట్నీ కోసం
1
పుదీనా
1
కొత్తిమీర
ఉప్పు
1.5
tbsp నిమ్మకాయ రసం
3
పచ్చిమిర్చి
చింతపండు స్వీట్ చట్నీ
1
tbsp నూనె
2
బిర్యానీ ఆకులు
1
tsp సొంపు
1
tbsp నలిపిన ధనియాలు
300
ml చింతపండు పులుసు (150 gm చింతపండు నుండి తీసినది)
1
tsp కారం
1
tsp వేయించిన జీలకర్ర పొడి
3/4
tsp ధనియాల పొడి
ఉప్పు
1
tsp నల్ల ఉప్పు
250
gm పంచదార/ బెల్లం
విధానం
దహీ భల్లా కోసం చల్లని పెరుగు లో పంచదార వేసి కరిగించి ఫ్రిజ్లో రెండు గంటలు ఉంచండి
5 గంటలు నానబెట్టిన మినపప్పుని మెత్తగా గట్టిగా ఎక్కువసేపు రుబ్బుకోవాలి
రుబ్బుకున్న పిండిలో జీడిపప్పు, కీసమిస్స్, సొంపు, ఉప్పు, వంట సోడా తగినన్ని నీళ్ళు పోసి బాగా కలుపుతూ బీట్ చేసుకోవాలి( ఒక సారి టిప్స్ చూడండి)
మరిగే వేడి నూనెలో బొండాలు వేసుకోండి, బొండాలు ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని తీసుకోండి.
వేపిన బొండాలని చల్లని నీళ్ళలో వేసి ఫ్రిజ్లో కనీసం గంటైనా ఉంచాలి. అప్పుడు అసలైన మజా తిన్తున్నప్పుడు
ఫ్రిజ్లోంచి తీసిన బొండాలలోంచి నీటి 70% మాత్రేమే పిండి ఒక బోల్లోకి తీసుకోండి
భల్లాలు కొన్ని ఒక బౌల్లోకి తీసుకోండి, దాని మీద చల్లని చిలికిన పెరుగు పోసుకోండి, పెరుగు మీద పుదీనా చట్నీ, చింతపండు చట్నీ, వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా, కారం కొద్దిగా చల్లుకోవాలి.
ఆఖరుగా సన్న కారప్పూస కొత్తిమీర తరుగు కొద్దిగా చల్లుకుని సర్వే చేసుకోవాలి.
పుదీనా చట్నీ కోసం:
పుదీనా చట్నీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి కొద్దిగా నీళ్
చింతపండు చట్నీ కోసం:
నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, దంచిన ధనియాలు, సొంపు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
వేగిన మసాలాలో చింతపండు పులుసుతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి చిక్కగా జిగురుజిగురుగా వచ్చేదాకా సన్నని సెగ మీద మరిగించి దించి చల్లార్చుకోండి.