దాల్ కిచిడి | దాల్ కిచిడి రెసిపీ | రెస్టారెంట్ స్టైల్ దాల్ కిచిడి రెసిపీ

Restaurant Style Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 30 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • బియ్యం పప్పు వండుకోడానికి:
  • ½ cup పెసరపప్పు
  • ½ cup బియ్యం
  • 1 tsp నెయ్యి
  • 750 ml నీరు
  • ¼ tsp పసుపు
  • కిచిడి తయారీకి:
  • 2 tbsp నూనె
  • 3 tbsp నెయ్యి
  • ½ tsp జీలకర్ర
  • 1 tsp అల్లం
  • 1 tbsp వెల్లులి
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 2 piches ఇంగువ
  • ½ cup ఉల్లిపాయ తరుగు
  • ½ cup టమాటో తరుగు
  • 1 litre వేడి నీరు
  • కొత్తిమీర - కొద్దిగా
  • 1 tbsp ధనియాల పొడి
  • ½ tsp జీలకర్ర పొడి
  • 1 tsp కారం
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేడి నీరు - లీటర్ పైన ఉండాలి
  • ఆఖరికి తాలింపు కోసం:
  • 2 tbsp నెయ్యి
  • 2 ఎండుమిర్చి
  • ½ tsp జీలకర్ర
  • 1 tsp వెల్లులి తరుగు
  • ¼ tsp కాశ్మిరీ కారం

విధానం

  1. పప్పుని బియ్యం ని గంట సేపు నానబెట్టి కుక్కర్లో వేసి అందులో నెయ్యి పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కనుంచుకోండి.
  2. కిచిడి కోసం నూనె నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర అల్లం అపచ్చిమిర్చి వెల్లులి ఇంగువ వేసి వేపుకోండి.
  3. జీలకర్ర చిట్లి వెల్లులి మగ్గిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి.
  4. ఉల్లి రంగు మారిన తరువాత టమాటో ముక్కలు వేసి టమాటో మెత్తబడే దాకా వేపుకోండి. టమాటో మెత్తబడ్డాక కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి మసాలాలు మాడకుండా వేపుకోండి.
  5. వేగిన మసాలాల్లో మెత్తగా ఉడికించుకున్న అన్నం కొద్దిగా నీరు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఎనుపుకోండి.
  6. అన్నం కాస్త గుజ్జుగా అయ్యాక మిగిలిన వేడి నీరు కూడా పోసి 4-5 నిమిషాలు అడుగుపెట్టకుండా కలుపుతూ ఉడికించుకోండి.
  7. దింపే ముందు ఉప్పు కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.
  8. నెయ్యి వేడి ఆఖరి తాలింపు సామాగ్రీ అంతా వేసి గుభాళించేలా తాలింపు వేపి స్టవ్ ఆపేసి కారం వేసి కలిపి కిచిడి పైన వేసి వేడివేడిగా వడ్డించండి.