ఖర్జూరం కేక్ | బెస్ట్ కేక్ కావాలంటే ఖర్జూరం కేక్ ట్రై చేయండి

Baking | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 25 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 10 - 12 పండు ఖర్జూరం
  • 175 ml నీళ్ళు (3/4 cup)
  • 1 గుడ్డు
  • 75 gm పంచదార (1/3 Cup + 1 tsp)
  • 1 tsp వెనీలా ఎసెన్స్
  • 3/4 cup మైదా (90 gm)
  • 1 tsp బేకింగ్ సోడా
  • 75 gm బటర్/ నూనె (1/3 కప్పు)
  • 90 ml ఖర్జూరం ఉడికించిన నీళ్ళు

విధానం

  1. ఖర్జూరం లో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి, వడకట్టి ఖర్జూరాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఖర్జూరం ఉడికించిన నీళ్ళని పక్కనుంచుకోండి
  2. బౌల్లో ఎగ్, పంచదరా, వెనీలా వేసి నురగ నురగా వచ్చేదాకా బీట్ చేసుకోండి. పంచదార కరిగి నురగ నురగా అవ్వాలి
  3. జల్లేడలో మైదా, వంట సోడా వేసి జల్లించి, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసి విస్కర్తో బీట్ చేసుకోవాలి.
  4. బీట్ అయిన కేక్ పిండిలో ఖర్జూరం ఉడికించుకున్న నీళ్ళు, ఖర్జూరం పేస్ట్ వేసి కట్ & ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి.
  5. 6 అంగుళాల కేక్ టీన్లో బటర్ పూసి మైదా వేసి తట్టి కేక్ పిండి టీన్లో పోసి 3-4 సార్లు తట్టి ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీల దగ్గర 25 నిమిషాలు బేక్ చేసుకోండి.
  6. బేక్ అయిన కేక్ని ఓవెన్ నుండి బయటకి తీసి టీన్లోనే పూర్తిగా చల్లార్చి తరువాత డీ-మౌల్డ్ చేసి ముక్కలుగా చేసుకోండి.