డాభా స్టైల్ బెండకాయ మసాలా

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms బెండకాయ ముక్కలు
  • 5 tbsps నూనె
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp ఆవాలు
  • 1 cup ఉల్లిపాయ తరుగు (రెండు ఉల్లిపాయలదీ)
  • 1 cup టొమాటో పేస్ట్ (రెండు టొమాటోలది)
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 2 పసుపు
  • 1 tsp కారం
  • ఉప్పు

విధానం

  1. 2 tbsp నూనె వేడి చేసిన అందులో బెండకాయ ముక్కలు వేసి బెండకాయ ముక్కలు ఎర్రబడే దాకా వేపి తీసుకోండి.
  2. అదే మూకుడులో 3 tbsp నూనె వేడి చేసి జీలకర్ర ఆవాలు వేసి వేపుకోవాలి
  3. ఉల్లిపాయ సన్నని తరుగు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారుతుండగా కరివేపాకు వేసి వేపుకోండి
  4. ఉల్లిపాయలు రంగు మారాక, అల్లం వెల్లులి పేస్ట్ ,మిగిలిన మసాలాలు కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
  5. టొమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి
  6. నూనె పైకి తేలాక వేపుకున్న బెండకాయ ముక్కలు వేసి 3-4 నిమిషాలు మగ్గిస్తే నూనె పైకి తేలుతుంది అప్పుడు దింపేసుకోండి.
  7. ఈ బెండకాయ మసాలా కూర అన్నం రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది.