డైమండ్ చిప్స్ | నమక్ పారే

Snacks | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 25 Mins
  • Resting Time 30 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms మైదా
  • 1/4 cup బియ్యం పిండి
  • 1 tsp వాము
  • ఉప్పు
  • 60 ml కరిగించిన డాల్డా / నెయ్యి
  • నీళ్ళు తగినన్ని
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. మైదా పిండిలో బియ్యం పిండి వాము ఉప్పు డాల్డా వేసి బాగా కలుపుకోవాలి.
  2. తరువాత తగినన్ని నీళ్ళు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత 30 నిమిషాలు రెస్ట్ ఇవాలి.
  3. 30 నిమిషాల తరువాత ఎక్కువ పొడి చల్లి పిండి ముద్దని సాధ్యమైనంత పలుచగా వత్తుకోవాలి.
  4. వత్తుకున్నాక పైన మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లి చిన్న డైమండ్స్లా కట్ చేసుకోండి. తరువాత చాకుతో డైమండ్స్ కింది నుండి లాగితే సులభంగా ఊడి వచ్చేస్తాయ్.
  5. డైమండ్స్ ని జల్లెడలో వేసి నెమ్మదిగా జల్లిస్తే పొడి పిండి కిందికి దిగుతుంది దీని వల్ల డైమండ్స్ ఎర్ర బడవు.
  6. డైమండ్స్ ని వేడి నూనె లో వేసి హై ఫ్లేమ్ మీద ఎర్రగా లేదా లేత గోధుమ రంగు వచ్చేదాకా వేపి తీసి జల్లెడలో వేసి 2-3 గంటలు వదిలేయండి.
  7. 3 గంటల తరువాత గాలి చోరని డబ్బాలో ఉంచుకోండి. 15 రోజులు తాజాగా ఉంటాయ్.