ఇడ్లీ పిండిలో ఉప్పు జీలకర్ర కొద్దిగా నీళ్ళు వేసి బాగా బీట్ చేసుకోండి (బీట్ చేస్తే బాగా పొంగుతుంది).
అడుగు మందంగా ఉండే ముకుడు అంతా నూనె పూసి ఉంచండి (పర్ఫెక్ట్ దిబ్బ రొట్టి కాల్చడానికి టిప్స్ చూడండి ).
నూనె రాసిన మూకుడులో మిగిలిన నూనె పోసి వేడి చేసుకోండి. తరువాత ఇడ్లీ పిండి అంతా పోసి మధ్యలో నీళ్ళు నింపిన గ్లాస్ గుచ్చి మూత పెట్టి సన్నని సెగ మీద 25 నిమిషాలు వదిలేయండి.
25 నిమిషాల తరువాత టూత్ పిక్ గుచ్చండి. పుల్లకి పిండి అంటుకోకుండా క్లీన్గా వస్తే దిబ్బ రొట్టె లోపల ఉడికినట్లే, ఇంకా అడుగు ఎర్రగా కాలీ ఉంటుంది.
తరువాత మధ్యలో ఉంచిన నీళ్ళ గ్లాస్ని తీసేయండి. అట్లకాడతో అడుగు నుండి తీస్తే సులభంగా వచ్చేస్తుంది. (దిబ్బ రొట్టె తయారయ్యింది నచ్చితే ఇలా తినేవచ్చు లేదా).
పెనం మీద 1 tbsp నూనె వేడి చేసి దిబ్బ రొట్టె పై వైపు పెనం మీద వేసి 10 నిమిషాలు సన్నని సెగ మీద వదిలేస్తే ఎర్రగా కాలుతుంది.
రెండు వైపులా కాలిన దిబ్బ రొట్టిని చెరుకు/బెల్లం పానకంతో లేదా మీకు నచ్చిన పొడి చట్నీతో ఆస్వాదించండి.