డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ | హైదరాబాదీ డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ

Non Veg Biryanis | nonvegetarian

  • Cook Time 30 Mins
  • Resting Time 30 Mins
  • Servings 7

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్కి డబుల్ మసాలా కోసం
  • 700 gm చికెన్
  • 250 ml పెరుగు (250 ml)
  • 1/4 cup పాల మీగడ
  • 2 tbsp నెయ్యి
  • 1/4 cup ఉల్లిపాయలు వేపుకున్న నూనె
  • ఉప్పు
  • 1 tbsp షాహీ జీరా
  • 10 లవంగాలు
  • 8 యాలకలు
  • 2 inches దాల్చిన చెక్క
  • 2 మరాటీ మొగ్గ
  • 1 బిర్యానీ ఆకు
  • 1 జాపత్రి
  • 1 tbsp యాలకల పొడి
  • 1 tbsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tbsp వేయించిన ధనియాల పొడి
  • 2 tbsp కారం
  • 1.5 tbsp ఉప్పు
  • 1 tbsp గరం మసాలా
  • 1/2 cup చిన్న కట్ట కొత్తిమీర తరుగు
  • 1/2 cup చిన్న కట్ట పుదీనా తరుగు
  • రెండు పెద్ద ఉల్లిపాయలు ఎర్రగా వేపుకున్నది
  • 2.5 tbsp రెండు నిమ్మకాయల రసం
  • 1.5 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • బిర్యానీ రైస్ వండుకోవడానికి
  • 2.5 cups బాస్మతి బియ్యం (375 gm)
  • 2.5 liters ఎసరు నీళ్ళు
  • 5 tbsp ఉప్పు
  • 1 tbsp షాహీ జీరా
  • 10 లవంగాలు
  • 6 యాలకలు
  • 2 inch దాల్చిన చెక్క
  • 1 జాపత్రి
  • 2 మరాటీ మొగ్గలు
  • 2 అనాస పువ్వులు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 3 tbsp కొత్తిమీర తరుగు
  • 3 tbsps పుదీనా తరుగు
  • 1 tbsp నిమ్మరసం
  • 3 tbsp ఎండిన గులాబీ రేకులు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • ధం చేసుకోడానికి
  • మైదా పిండి ముద్ద
  • 1/4 tsp గరం మసాలా
  • 1/2 cup నెయ్యి
  • 1/4 cup ఉల్లిపాయలు వేపుకున్న నూనె
  • 1/4 cup ¼ పాలల్లో నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వు
  • 2 tbsp వేపుకున్న ఉల్లిపాయలు
  • కొద్దిగా కొత్తిమీర తరుగు
  • 1/3 cup ఎసరు నీళ్ళు

విధానం

  1. చికెన్ మసాలా కశవం ఉంచిన పదార్ధాలన్నీ వేసి గట్టిగా పిండుతూ మసాలాల్ని కలుపుకోవాలి.
  2. మసాలాలు కలిపాక చికెన్ వేసి మసాలాని బాగా రుద్ది చికెన్కి పట్టించి రాత్రంతా లేదా కనీసం 3 గంటలైన ఫ్రిజ్లో ఉంచండి
  3. బాస్మతి బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టాలి
  4. ఎసరు మరిగించి అందులో ఎసరు వేసే మసాలా సామానంతా వేసి ఎసరుని మసల కాగనివ్వాలి.
  5. తరువాత నానిన బాస్మతి బియ్యం వేసి హై- ఫ్లేమ్ మీద 60% ఉడికించుకోవాలి.
  6. మరుగుతున్న ఎసరులోంచి 100 ml ఎసరుని నానబెట్టిన చికెన్లో కలుపుకోవాలి. గిన్నె అంచుల వెంట ఉన్న మసాలాలు శుభ్రంగా తుడిచేయాలి.
  7. 60% ఉడికిన అన్నాన్ని వడకట్టి చికెన్ మీద రెండు లేయర్స్ గా వేసుకోవాలి. దాని మీద 70% ఉడికిన అన్నాన్ని మరో లేయర్ గా దాని మీద ఆఖరుగా 80 % ఉడికిన అన్నం వేసుకుని అన్నాన్ని సమానంగా సర్దుకోవాలి.
  8. తరువాత ధం చేసుకునే పదార్ధాలన్నీ అన్నం మీద వేసుకోండి. నెయ్యి, నూనె, కుంకుమ పువ్వు పాలు బిర్యానీ అంతా పోసుకోండి. ఎసరు నీళ్ళు గిన్నె అంచుల వెంట పోసుకోండి.
  9. మైదా ముద్ద గిన్నె అంచుల వెంట పెట్టి గట్టిగా మూత బిగించి ఒక దగ్గర చిన్న రంధ్రం చేసుకుని పొయ్యి మీద హై-ఫ్లేమ్ మీద చేసుకున్న రంధ్రం నుండి వేగంగా వచ్చేదాకా హై-ఫ్లేమ్ వండుకోండి.
  10. స్టీమ్ వేగంగా వస్తున్నప్పుడు మంట తగ్గించి గిన్నె నాలుగు వైపులా అంటే ఒక్కో వైపు రెండేసి నిమిషాలు సన్నన్నీ సెగ మీద నాలుగు వైపులా వండుకుని. మళ్ళీ మధ్యలో మరో రెండు నిమిషాలు వండి స్టవ్ ఆపేసి 30 నిమిషాలు వదిలేయాలి.
  11. 30 నిమిషాల ధం మీద చికెన్ బాగా ఉడికి అన్నం పొడి పొడిగా ఉడికిపోతుంది. 30 నిమిషాల తరువాత అడుగు నుండి తీసి చల్లని రైతాతో సర్వ చేసుకోండి.