ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి | మనం మరిచిపోయిన ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి

Pickles & Chutneys | nonvegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup రొయ్య పొట్టు
  • 10 వెల్లులి
  • 300 gm టొమాటోలు
  • 1 1/2 cup ఉల్లిపాయ
  • 2 పచ్చిమిర్చి
  • 3 ఎండు మిర్చి
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 1/4 tsp పసుపు
  • 2 tsp ధనియాల పొడి
  • 2 1/2 tsp కారం
  • ఉప్పు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/3 cup నూనె

విధానం

  1. రొయ్య పొట్టుని మూకుడులో వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ 2-3 నిమిషాలు సెగ తగిలేలా వేపితే రొయ్యకి ఉండే సన్నని పొట్టు ఊడుతుంది
  2. వేపిన రొయ్యలని జల్లేడలో వేసి రొయ్యలపైన పైన నీళ్ళు పోసి కడగండి. అలాగే వెల్లులిని దంచుకోండి
  3. కడిగిన రొయ్యలలో కొద్దిగా నూనె, ఉప్పు, దంచిన వెల్లులి వేసి బాగా కలుపుకోండి
  4. రొయ్యలు ఉన్న జల్లెడతో పాటు పొయ్యి మీద పెట్టి 3-4 నిమిషాలు కలుపుతూ వేపుకోవాలి(ఎక్కువగా వేపితే చేదుగా అవుతుంది) వేగిన రొయ్యలని దింపి పక్కనుంచుకోండి
  5. ముకుడులో నూనె వేసి టొమాటోలు వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యన కలుపుతూ మగ్గించుకోవాలి. 15 నిమిషాలకి టొమాటోలు మెత్తగా మగ్గుతాయ్ అప్పుడు గరితతో గుజ్జుగా చేసి దింపేసుకోండి
  6. ముకుడులో మిగిలిన నూనె పోసి వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి
  7. వేగిన తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తగా మగ్గనివాలి. మగ్గిన ఉల్లిపాయాల్లో ఉప్పు, ధనియాల పొడి, కారం, టొమాటో గుజ్జు వేసి నూనె పైకి తేలేదాక మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి
  8. నూనె పైకి తేలాక వేపుకున్న రొయ్య పొట్టు వేసి బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేదాక వేపి దింపేసుకోవాలి. ఈ తొక్కు కనీసం వారం రోజులు నిలవ ఉంటుంది.