ఎగ్ పులావు | అన్నం మిగిలిపోతే 5mins లో ఈ పులావు చేసెయ్యండి

Weekend Special | nonvegetarian|eggetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Total Time 17 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 5 ఉడికించిన గుడ్లు
  • 2 tbsps నెయ్యి
  • 1 tsp షాహీజీర
  • 1 బిరియానీ ఆకు
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • ఉల్లిపాయ సన్నని చీలికలు
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 3 పచ్చిమిర్చి తరుగు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 1/2 tsp పసుపు
  • 1/2 tsp గరం మసాలా
  • 1 cup ఉడికించుకున్న అన్నం (110 gms)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పుదీనా తరుగు - కొద్దిగా

విధానం

  1. నెయ్యి కరిగించి, అందులో షాహీజీరా , బిర్యానీ ఆకు, యాలకలు లవంగాలు వేసి వేపుకోండి
  2. సన్నని ఉల్లిపాయ చీలికలు వేసి ఉల్లిపాయ ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి
  3. అల్లం వెల్లులి ముద్దా, పచ్చిమిర్చి , జీలకర్ర పొడి , పసుపు ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి బాగా వేపుకోవాలి
  4. ఉడికించిన గుడ్లు వేసి గుడ్డు పైన ఎర్రగా వేగేదాకా వేపుకోండి.
  5. గుడ్డు వేగిన తరువాత మూకుడులో ఉడికించిన అన్నం కొత్తిమీర పుదీనా తరుగు వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఈ పులావ్ వేడిగా చల్లగా ఎలా అయినా టేస్టీగా ఉంటుంది.