మటన్ పులావ్ కుక్కర్లో | 100% బెస్ట్ మటన్ పులావ్ కుక్కర్లో

Mutton Recipes | nonvegetarian

  • Prep Time 15 Mins
  • Cook Time 25 Mins
  • Resting Time 20 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 4 tbsp నూనె/నెయ్యి
  • 2 ఇంచులు దాల్చిన చెక్క
  • 6 లవంగాలు
  • 6 యాలకలు
  • 1 tsp షాహీ జీరా
  • 1 నల్ల యాలక
  • 1 బిరియానీ ఆకు
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 6 పచ్చిమిర్చి చీలికలు
  • 1 tsp గరం మసాలా
  • పసుపు – రెండు చిటికెళ్లు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1.5 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 2 tbsp ఎండిన గులాబీ రేకులు/ రోజ్ వాటర్ (1 tsp)
  • 1.5 cup బాసమతి బియ్యం (గంట సేపు నానబెట్టుకోవాలి) - 250 gm)
  • 300 gm మటన్ (2 గంటలు ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టినది)
  • 1.5 cup మటన్ ఉడికించడానికి నీరు
  • 1 cup పులావ్ వండడానికి నీరు

విధానం

  1. కుక్కర్ లో నూనె పోసి అందులో చెక్కా, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలక, యాలకలు, షాహీ జీరా వేసి వేపుకోవాలి
  2. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయని ఎర్రగా వేపుకోవాలి
  3. ఉల్లిపాయలు ఎర్రబడుతుండగా అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి
  4. మటన్ వేసి 4-5 నిమిషాలు వేపుకోవాలి. వేపుకున్న మటన్లో కారం జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు తగినన్ని నీళ్ళు పోసి మటన్ మెత్తగా ఉడ కనివ్వండి.
  5. మటన్ ఉడికిన తరువాత నీరు 1 కప్పు ఉంటుంది. అందులో నానబెట్టిన బియ్యం, ఉప్పు, మరో కప్పు కంటే కాస్త తక్కువ నీరు, ఎండిన గులాబీ రేకులు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయండి.
  6. 20 నిమిషాల తరువాత అట్లకాడతో అడుగునుండి కలిపి మిర్చీ కా సాలన్ ఇంకా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి