కావాల్సిన పదార్ధాలు
-
1
tbsp మిరియాలు
-
10 - 12
వెల్లూలీ
-
1
tbsp జీలకర్ర
-
600
ml చింతపండు పులుసు
(పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
-
1
టొమాటో ముక్కలు
-
1
tbsp నూనె
-
1/4
tsp పసుపు
-
3
ఎండు మిర్చి
-
1
tsp ఆవాలు
-
3 - 4
కరివేపాకు
(కాడలతో సహ)
-
కొత్తిమీరా తరుగు – చిన్న కట్ట
-
ఉప్పు
-
2
pinches ఇంగువ
విధానం
-
మిరియాలు, వెల్లూలీ, జీలకర్ర రోట్లో వేసి బరకగా దంచుకోండి.
-
గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేపుకోండి.
-
బాగా పండిన టొమాటో ముక్కలు వేసి టొమాటోలు గుజ్జుగా అయ్యేదాక మగ్గించండి.
-
మగ్గిన టొమాటోలో చింతపండు పులుసు, దంచుకున్న మిరియాల ముద్ద, ఉప్పు, కరివేపాకు కొత్తిమీరా, ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసి దింపేసుకోండి.
-
ఈ చారు అన్నం, ఇడ్లీ, వడ ల్లోకి చాలా బాగుంటుంది. ఇంకా జలుబు చేసినప్పుడు వడకట్టి “టీ” లా కూడా తీసుకోవచ్చు.