నూనె వేడి చేసి అందులో పసుపు వేసి, ఆ తరువాత పచ్చి రొయ్యలు వేసి మీడియం ఫ్లేం మీద రొయ్యల్లోని నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా వేపుకుని ఓ బౌల్ లోకి తీసుకోండి.
ఇప్పుడు అదే మూకుడులో మరో 2 tsp నూనె వేసి ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోండి.
ఉల్లిపాయలు సగం పైన వేగాక అప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా వేపుకోండి.
ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుండగా అప్పుడు అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా వేపుకోండి.
ఇప్పుడు రొయ్యలు వేసి బాగా మరో 3 నిమిషాలు వేపుకుని పొడి పొడిగా ఉడికిన్చుకున్న అన్నం వేసి బాగా కలిపి, పైన కొత్తిమీరా, పుదినా తరుగు నెయ్యి వేసి బాగా కలిపి దింపి రైతా తో సర్వ్ చేసుకోండి