బ్యాచిలర్స్ చికెన్ కర్రీ

Bachelors Recipes | nonvegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 40 Mins
  • Resting Time 30 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kilo చికెన్
  • 4 యాలకలు
  • 8 లవంగాలు
  • 1/2 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 tbsp ధనియాలు
  • 2 inches దాల్చిన చెక్క
  • 1/3 cup ఎండుకొబ్బరి
  • పత్తర్ ఫ్యూల్ - కొంచెం
  • 1 tbsp గసగసాలు
  • 1 మరాఠీ మొగ్గ
  • 15 ఎండు మిర్చి
  • 1/2 cup పెరుగు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు రుచికి సరిపడా
  • 2 tbsp నూనె
  • 1 tbsp నిమ్మరసం
  • 4 tbsp పచ్చిమిర్చి చీలికలు
  • కొత్తిమీర పుదీనా తరుగు - కొద్దిగా
  • కర్రీ కోసం
  • 1/4 cup నూనె
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 10 వెల్లులి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 cup టమాటో తరుగు
  • 1/2 liter నీళ్లు
  • 1 tsp నిమ్మరసం
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

విధానం

  1. చికెన్ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకుని మిక్సీలో వేసుకోవాలి.
  2. మిక్సీలో పెరుగు ఉప్పు అల్లం వెల్లులి పేస్ట్ పసుపు వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. చికెన్లో గరిండ్ చేసుకున్న మసాలా పేస్ట్ నూనె నిమ్మరసం పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి ముక్కలని గట్టిగా పిండుతూ మసాలా పేస్ట్ పట్టించి కనీసం 30 నిమిషాలైనా నానబెట్టుకోవాలి.
  4. నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు వెల్లులి కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని మెత్తబడేదాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిలో టామాటో ముక్కలు వేసి టమాటో పైన తోలు ఊడేదాక మగ్గించుకుంటే చాలు.
  6. నానబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక మధ్యమధ్యన కలుపుకుంటూ వేపుకోవాలి.
  7. నూనె పైకి తేలిన తరువాత 500ml నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక ఉడకనివ్వాలి. సుమారు 25 నిమిషాలకి నూనె పైకి తేలుతుంది.
  8. నూనె తేలాక నిమ్మరసం కొత్తిమీర తరుగు చల్లి దింపి వేడిగా అన్నంతో, జొన్న రొట్టెలతో లేదా బగారా అన్నంతో సర్వ్ చేసుకోండి.