నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు ఉప్పు వేసి ఉల్లిపాయని మెత్తబడనివ్వాలి.
ఉల్లిపాయ మెత్తబడిన తరువాత కాప్సికం తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి వేపుకోండి.
వేగిన ఉల్లిలో మసాలా పొడులు నీరు వేసి వేపితే మసాలాలు మాడకుండా వేగుతాయి.
వేగిన మసాలాలో కొత్తిమీర తరుగు టమాటో సాస్ వేసి కలిపి దింపేసుకోండి.
మిల్క్ బ్రెడ్ అంచులని తీసేయండి.
బ్రెడ్ అంచులని వదిలేసి ఉల్లిపాయ మిశ్రమం బ్రేడ్ అంతా పూసుకోండి, ఆ పైన సగానికి కోసిన గుడ్డు పెట్టుకోండి.
బ్రెడ్ అంచులని నీటితో తడపండి, పైన పెట్టె బ్రెడ్ మీద కూడా కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమం పూసుకుని తడి చేసిన అంచులని గట్టిగా అంటించండి.
సెనగపిండిలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి కనీసం 5-7 నిమిషాలపాటు బాగా బీట్ చేసుకోండి. ఆఖరుగా సోడా వేసి ఇంకో ½ నిమిషం బీట్ చేసుకుంటే పిండి చక్కగా తేలికపడుతుంది.
బీట్ చేసుకున్న సెనగపిండిలో బ్రెడ్ ముంచి మరిగే వేడి వేడి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా వేపి తీసుకోండి
వేడి మీద సగానికి కోసి టమాటో సాస్ తో ఆశ్వాదించండి!!!