రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ

Breakfast Recipes | nonvegetarian|eggetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • దోశ పిండి కోసం
  • 1 cup మినపప్పు (4 గంటలు నానబెట్టినవి)
  • 2.5 cup దోశల బియ్యం (4 గంటలు నానాబెట్టాలి)
  • 1 tsp మెంతులు (4 గంటలు నానబెట్టాలి)
  • 1/2 cup అటుకులు (4 గంటలు నానాబెట్టాలి)
  • ఎర్ర కారం కోసం
  • 100 gm ఎండు మిరపకాయలు
  • 50 gm చింతపండు
  • 15 వెల్లులి
  • ఉప్పు
  • నీళ్ళు – పేస్ట్ చేసుకోవడానికి
  • 75 ml నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • నీళ్ళు పచ్చడిలో కలుపుకోడానికి
  • దోశ కోసం
  • నూనె – దోసలు కాలచడానికి
  • ఉప్పు – పిండి తగినంత
  • గుడ్లు
  • ఎర్ర కారం పచ్చడి

విధానం

  1. పప్పు బియ్యం మెంతులు అటుకులు అన్నీ 4 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బి 12 గంటలు పులియబెట్టాలి (పర్ఫెక్ట్ పిండి కోసం టిప్స్ చూడండి).
  2. 12 గంటలు పులిసిన పిండిలో తగినంత ఉప్పు నీరు కలిపి పక్కనుంచుకోండి.
  3. ఎర్రకారం కోసం ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, వెల్లులి తగినంత నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. నూనె వేడి చేసి ఆవాలు కరివేపాకు వేసి వేపుకోవాలి, వేగిన తాలింపులో ఎర్రకారం పేస్ట్, కొద్దిగా నీళ్ళు పోసి నూనె పైకి తేలేదాక మధ్య మధ్యన కలుపుతూ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
  5. నూనె పైకి తేలాక పూర్తిగా చల్లార్చి సీసాలో ఉంచుకుంటే ఫ్రిజ్లో రెండు నెలలు నిలవ ఉంటుంది.
  6. బాగా వేడెక్కిన పెనం మీద పెద్ద గరితేడు పిండి పోసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని. ఆ వెంటనే 2.1/2 tbsp నూనె అట్టు అంచులు మధ్యన వేసి కాల్చుకోవాలి.
  7. అట్టు మధ్యన ఎర్రబడుతుండగా ఎర్రకారం గుడ్డు వేసి స్ప్రెడ్ చేసి ఒక నిమిషం కాలనిచ్చి తిప్పి మరో వైపు 30 సెకన్లు కాల్చి తీసేసుకోండి.
  8. ఈ ఎగ్ దోశ వేడిగా పల్లీల పచ్చడి, శెనగపప్పు పచ్చడితో ఎంతో రుచిగా ఉంటుంది.