ఎగ్ మసాలా ఫ్రై | తక్కువ టైమ్లో చేసకునే బెస్ట్ ఎగ్ కర్రీ | సింపుల్ ఎగ్ ఫ్రై
Egg Recipes
|
nonvegetarian
Prep Time10 Mins
Cook Time15 Mins
Servings4
కావాల్సిన పదార్ధాలు
4
ఉడికించిన గుడ్లు
3
ఉల్లిపాయలు (సన్నని తరుగు)
4
పచ్చిమిర్చి చీలికలు
ఉప్పు
1
tbsp కారం
1/4
tsp పసుపు
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
4
tbsp నూనె
మసాలా పొడి కోసం
2
tbsp ధనియాలు
2
tsp గసగసాలు
1/4
cup ఎండుకొబ్బరి
1
అనాసపువ్వు
1
inch దాల్చిన చెక్క
3
యాలకలు
4
లవంగాలు
విధానం
సన్నని సెగ మీద మసాలా దినుసులు అన్నీ ఒక్కోటిగా మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి.
వేపుకున్న మసాలాలని చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి
నూనె వేడి చేసి ఉడికించిన గుడ్లు వేసి మూత పెట్టి కాస్త ఎర్రబడే దాకా వేపుకుని తీసుకోవాలి
అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి
తరువాత వేగిన ఉల్లిపాయల్లో పసుపు, కారం అల్లం వెల్లులి ముద్ద వేసి 2 నిమిషాలు వేపుకోవాలి
ఉడికించిన గుడ్లని అంగుళం సైజ్ ముక్కలుగా చీరి కూరలో వేసుకోండి ఇంకా మెత్తగా పొడి చేసుకున్న మసాల కూడా వేసి 2 నిమిషాలు వేపి, పైన కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి దింపేసుకోండి.