ఏగ్లెస్ మయోనైస్ | ప్రతీ ఇంట్లో ఉండే వాటితో మయోనైస్

Sauces and Dressing | vegetarian

  • Cook Time 10 Mins
  • Total Time 10 Mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup చిక్కని చల్లని పాలు
  • 1/2 cup రెఫైండ్ నూనె
  • 1/2 tsp పంచదార
  • 1/2 tsp ఉప్పు
  • 1 tsp డిజోన్ మాస్టర్డ్
  • 1 tsp వెనిగర్

విధానం

  1. బ్లెండర్లో పాలు ఉప్పు పంచదార వేసి హై – స్పీడ్ మీద 30 సెకన్లు బ్లెండ్ చేసి ఆపేయండి.
  2. తరువాత 2 tbsp నూనె వేసి బ్లెండ్ చేసి మళ్ళీ ఆపండి. మళ్ళీ 2 tbsp నూనె వేసి మళ్ళీ హై- స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి.
  3. ఇలా హై-స్పీడ్ మీద ప్రతీ 30 సెకన్లుకి ఒక సారి ఆపుకుంటూ 8-10 సార్లుగా నూనె కొద్ది కొద్దిగా చిక్కబడే దాకా వేసుకోవాలి.
  4. ఆఖరున డిజోన్- మాస్టర్డ్, వెనిగర్ వేసి చిక్కబడే దాకా బ్లెండ్ చేసుకోండి.
  5. చిక్కగా అయిన మయోనైస్ని గాలి చొరని సీసాలో పోసి ఫ్రిజ్లో ఉంచితే నెల రోజుల పైన నిలవుంటుంది.