7 ఇంచెస్ కేక్ మౌల్డ్ లో నూనె పూసి కొంచెం మైదా వేసి కోట్ చేసి పక్కనుంచాలి.
మిక్సింగ్ బౌల్ లో నూనె పెరుగు పాలు వేసి బాగా కలిసేదాకా కలుపుకోవాలి.
బొంబాయ్ రవ్వ వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.
రవ్వ కలిసాక పంచదార వేసి కరిగేదాకా కలుపుకోవాలి.
రవ్వ పైన జల్లెడ పెట్టి మైదా, పాల పొడి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉప్పు వేసి జల్లించి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నిదానంగా కలుపుకోవాలి
వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి.
ఆఖరున టూటి ఫ్రూటి లో కొంచెం మైదా వేసి కలిపి పిండి లో నిదానంగా కలుపుకోవాలి.
కలుపుకున్న పిండిని కేక్ టిన్ లో పోసి ప్రీ హీట్ చేసిన కుక్కర్ లేదా ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో పెట్టి 40 నిమిషాలు లేదా టూత్ పిక్ గుచ్చితే క్లీన్ గా వచ్చేదాకా బేక్ చేసుకోవాలి.
టూత్ పిక్ క్లీన్ గా వస్తే కేక్ ని బయటకి తీసి 10 నిమిషాలు చల్లార్చి తరువాత క్లాత్ కప్పి 30 నిమిషాలు వదిలేయాలి, ఆ తరువాత కట్ చేసుకోవాలి.