గంజి అన్నం

Summer Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Resting Time 720 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం (185 gm)
  • 4 cups నీళ్లు (లీటర్)
  • 2 cups మజ్జిగ (½ లీటర్)
  • 2 Pinches వాము
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 ఉల్లిపాయ (4 పాయలుగా చేసుకున్నది)
  • 2 పచ్చిమిర్చి
  • 1/2 liter నీళ్లు

విధానం

  1. కడిగి నానబెట్టిన బియ్యంలో కప్పుకి నాలుగు కప్పుల నీళ్లు పోసి అన్నాన్ని మెత్తగా వండుకుని మిగిలిన గంజిని వార్చేయండి. తీసుకున్న గంజిని చల్లార్చండి. ( గంజి అన్నం కోసమే అన్నం వండితే అన్నాన్ని గంజి వార్చకుండా అన్నం ఉడికిన తరువాత దింపి పూర్తిగా చల్లార్చి మిగిలిన పద్ధతి ఫాలో అవ్వండి).
  2. ఇదే మిల్లెట్స్తో చేసుకోదలిస్తే మిల్లెట్స్ కడిగి కనీసం 3-4 గంటలు నానబెట్టాలి, కప్పుకి 6-8 కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించి గంజి వార్చుకోవాలి.
  3. చల్లారిన అన్నంలో చల్లారిన గంజి మజ్జిగతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి కలిపి మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి.
  4. తెల్లారాక మరో సారి కలిపి నచ్చితే ఆవకాయ లేదా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినొచ్చు.