రాగి ఇడియప్పం | ఇడ్లీ కంటే ఎన్నో రేట్లు మేలుచేసే రాగి ఇడియాప్పం

Breakfast Recipes | vegetarian

  • Prep Time 30 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 2 cups రాగి పిండి
  • 2 cups వేడి నీళ్ళు
  • 1.5 tbsp నెయ్యి
  • 1/4 tsp ఉప్పు
  • 1/2 liter పాలు
  • 3 tbsp పంచదార
  • 1/4 tsp యాలకలపొడి

విధానం

  1. రాగి పిండిలో నెయ్యి ఉప్పు వేసి వేళ్ళతో బ్రెడ్ పొడిలా అయ్యేదాక మర్దన చేయాలి.
  2. వేడి నీళ్ళు పోసి అట్ల పిండి జారుగా కలుపుకోవాలి
  3. కలుపుకున్న పిండిని పాన్లో పోసి కలుపుతూ ఉంటే ఉప్మాలా తయారవుతుంది.
  4. రాగి ముద్దని 5 నిమిషాలు చల్లార్చి, తరువాత చేతికి నూనె రాసుకుని 4-5 నిమిషాలు బాగా వత్తుకోవాలి. తరువాత చిన్న ఉండాలు చేసుకోవాలి
  5. కారప్పూస గిద్దకి నూనె రాసి అందులో సన్న కారప్పూస ప్లేట్ ఉంచి అందులో రాగి ముద్ద పెట్టి అరిటాకు లేదా నూనె రాసిన ప్లేట్ మీద ఒక చుట్టు చుట్టుకోండి.
  6. చుట్టుకున్న ఇడియప్పంని స్టీమ్ మీద 5 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద 3 నిమిషాలు లో-ఫ్లేమ్ మీద 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
  7. గిన్నెలో పాలు పోసి అందులో పంచదార వేసి ఒక పొంగు రానివ్వాలి, ఆఖరున ¼ tsp యాలకలపొడి వేసి కలిపి దింపేసుకోవాలి
  8. కాస్త చల్లారిన ఇడియప్పం ప్లేట్లోకి తీసుకుని వేడి పాలు 100 ml దాకా ఇడియప్పం అంతా పోసి తడుపుకోవాలి.
  9. పైన కొద్దిగా పంచదార, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము చల్లుకుని ఆనందించండి. నచ్చితే పాలకి బదులు కూర్మతో కూడా తినవచ్చు.
  10. పొద్దు పొద్దున్నే కమ్మని పాలతో రాగి ఇడియప్పం రుచి చాలా బాగుంటుంది. సాయంత్రాలు కుర్మాతో ఇంకా బాగుంటుంది.