3
tbsps సామ బియ్యం/కొర్ర బియ్యం (రెండు గంటలు నానబెట్టినది)
3
tbsps కందిపప్పు
1/2
tsp జీలకర్ర
1/2
tsp ధనియాలు
1
రెబ్బ కరివేపాకు
4 - 5
వెల్లూలి
1
పచ్చిమిర్చి తరుగు
1/2
కట్ట తోటకూర
400
ml నీళ్ళు
1
tsp నెయ్యి
సైంధవ లవణం- రుచికి సరిపడా
విధానం
రాగిపిండి లో ఎక్కడా ఉండలు లేకుండా 100ml నీళ్ళు పోసుకుని బాగా కలిపి పక్కనుంచుకోండి.
పొడి కోసం ఇప్పుడు బాండీ లో వేరుసెనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వెల్లూలి ఒక్కొటిగా వేసుకుంటూ లో ఫ్లేం మీద వేపుకుని చల్లార్చుకోండి.
చల్లారాక మిక్సి జార్ లో వేసి కాస్త బరకగా పొడి చేసుకోండి.
దలియ కోసం 300 ml నీళ్ళు మరిగించుకుని కాస్త జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న సామ బియ్యం, పచ్చిమిర్చి తరుగు, తోటకూర తరుగు వేసి మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేం మీద ఉడకనివ్వండి.
ఆ తరువాత రాగి పిండి మిశ్రమాన్ని కలిపి పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేం మీద కాస్త దగ్గర పడనివ్వండి.
దగ్గరపడ్డాక వేరుసెనగ కందిపొడి, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగ కలుపుకుని మూతపెట్టి 3-4నిమిషాలు లో ఫ్లేం లో మూత పెట్టి ఉడకనివ్వండి.
దింపే ముందు 1 tsp ఆవు నెయ్యి, 1/2 చెక్క నిమ్మ రసం వేసి కలుపుకుని వేడి వేడి గా సర్వ్ చేసుకోండి.
ఈ దలియా ఏ నంజుడు లేకపోయినా చాలా రుచిగా ఉంటుంది లేదా పెరుగు చట్నీతో ఇంకా బాగుంటుంది.