అవిసెగింజల కారం పొడి

Breakfast Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 tsp నూనె
  • 1/2 cup అవిసెగింజలు
  • 17 - 20 ఎండుమిర్చి
  • 1 tbsp పచ్చి సెనగపప్పు
  • 1 tbsp పొట్టు మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 2 tbsp ధనియాలు
  • 7 - 8 వెల్లులి
  • చింతపండు - చిన్న ఉసిరికాయ సైజు
  • ఉప్పు

విధానం

  1. Tsp నూనె వేడి చేసి అవిసె గింజలు వేసి సన్నని సెగ మీద చిట్లనివ్వాలి, చిట్లుతున్న అవిసెగింజలని మరో పళ్లెంలోకి తీసుకోండి
  2. మరో tsp నూనె వేడి చేసి అందులో పచ్చి సెనగపప్పు, పొట్టు మినపప్పు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
  3. పప్పు రంగు మారి మాంచి సువాసన వస్తుండగా జీలకర్ర ధనియాలు వేసి ఎర్రగా వేపి తీసుకోండి
  4. తరువాత యనేందు మిర్చి వేసి రెండు నిమిషాలు వేపుకోవాలి, ఎండుమిర్చి రంగు మారుతున్నప్పుడు వెల్లులి వేసి వేసి వేపుకోండి పొట్టుతోనే.
  5. వేగిన ఎండుమిర్చి అవిసెగింజలు చల్లారుస్తూన్న పళ్లెంలోకి వెల్లులి మరో కప్పులోకి తీసుకోండి
  6. చల్లారుతున్న పప్పులోనే చింతపండు ఉప్పు కూడా వేసి కలిపి మిక్సీలో ఇడ్లీ అట్టుల్లోకి అయితే బరకగా, కూరల్లోకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆఖరున వెల్లులి వేసి 2-3 సార్లు పల్స్ చేసి తీసుకోండి .
  7. గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే ఈ పొడి కనీసం రెండు నెలలు నిల్వ ఉంటుంది.