కొర్రల పొంగలి | అందరికి ఆరోగ్యకరమైన కట్టే పొంగలి

Breakfast Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 30 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup కొర్రలు
  • 1 cup పెసరపప్పు
  • 1 tsp మిరియాలు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/4 spoon ఇంగువ
  • 1 tsp జీలకర్ర
  • 10 - 15 జీడిపప్పు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1/4 cup నెయ్యి
  • ఉప్పు- తగినంత

విధానం

  1. పెసరప్పు ని లో ఫ్లేం మీద మంచి సువాసనోచ్చెంత వరకు వేపుకుని చల్లార్చి, తరువాత నీళ్ళలో వేసి కడుక్కోండి. (ఇవి మంచి సువసనోచ్చెంత వరకు వేగడానికి 15 నిమిషాల టైం పడుతుంది).
  2. ప్రెషర్ కుక్కర్ లో రాత్రంతా నానబెట్టిన కొర్రలు, పెసరప్పు, ఉప్పు వేసి, 5 కప్స్ నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4 విసిల్స్ రానివ్వండి.
  3. 4 విసిల్స్ తరువాతా ఇంకా పొంగల్ లో కాస్త నీరుంటుంది అది చల్లరేపాటికి గట్టి పడుతుంది.
  4. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకుని జీడిపప్పు తో పాటు మిగిలిన సామానంతా వేసి మంచి సువాసనోచ్చేదాక వేపుకుని పొంగల్ లో కలుపుకోండి.