ముందుగా సాలాడ డ్రెస్సింగ్ కోసం మిక్సీ జార్లో ఫరశ క్రీమ్, పంచదార, నానబెట్టిన బాదం, మిరియాల పొడి చిటికెడు ఉప్పు వేసి క్రీమ్లా పేస్ట్ చేసుకోవాలి.
పేస్ట్లా చేసుకున్న డ్రస్సింగ్ని ఫ్రిజ్లో 30 నిమిషాలు ఉంచండి.
ఒక గిన్నెలో ఐస్ ముక్కలు, ఫ్రీజలోని చల్లని నీరు పోసుకోండి. అందులో పంచదార నిమ్మరసం వేసి కలిపి పక్కనుంచుకోండి.
గట్టిగా తాజాగా ఉన్న ఆపిల్ని ముక్కలుగా తరిగి నీళ్ళలో వేసుకోండి అలాగే పైనాపిల్, కర్బూజా కూడా.
ఫ్రిజ్లోని చల్లని ద్రాక్షని ముక్కలుగా చేసుకోండి.
పది నిమిషాల తరువాత ఆపిల్తో మిగిలిన ఫ్రూట్స్ని వడకట్టి పక్కనుంచుకోండి.
మిక్సింగ్ బౌల్లో చల్లని దానిమ్మ గింజలు, ఆరెంజ్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, వాడకట్టుకున్న ఫ్రూట్స్, ఐసబర్గ్ లెట్టస్ ఇంకా చల్లని సలాడ్ డ్రెస్సింగ్ వేసి నెమ్మదిగా టాస్ చేయండి.
పైన వాల్నట్స్, ఎండు ద్రాక్ష, నానబెట్టిన బాదాం ముక్కలు, ఖర్ఝూరం ముక్కలు వేసి వెంటనే సర్వ చేసుకోండి.