ఫ్రూట్ రవ్వ కేసరి

Sweets | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 25 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup రవ్వ
  • 1/2 cup సెనగపిండి
  • 1 cup పంచదార
  • 1 cup నీళ్లు
  • 1 1/4 cup పాలు
  • 3 యాలకలు
  • 2 tbsp టూటీ ఫ్రూటీ (ఎల్లో రెడ్ కలర్వి లేదా ఇంకేదైనా కలర్)
  • 10 బాదాం
  • 15 జీడిపప్పు
  • 7 - 8 పిస్తా
  • 1/2 cup నెయ్యి
  • 4 - 5 చుక్కలు పైనాపిల్ ఎసెన్స్
  • 1 tsp ఎల్లో ఫుడ్ కలర్

విధానం

  1. పావు కప్పు నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు బాదాం పిస్తా వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  2. మిగిలిన నెయ్యిలో యాలకలు(దంచకండి) రవ్వ సెనగపిండి వేసి మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోండి.
  3. వేగిన రవ్వలో నీళ్లు పాలు పోసి దగ్గర పడనివ్వాలి.
  4. దగ్గర పడుతున్న రవ్వలో ఎసెన్స్ పంచదార ఎల్లో ఫుడ్ కలర్ వేసి పంచదారని కరగనివ్వాలి.
  5. కరిగిన పంచదారలో టూటి ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి కలిపి దింపేసుకోండి.