ముందుగా వెల్లులి మసాలా ముద్ద కోసం ఉంచిన పదార్ధాలన్నీ మెత్తగా దంచుకోండి. లేదా మిక్సీలో బరకగా రుబ్బుకోండి.
చికెన్ ముక్కల్లో దంచుకున్న వెల్లులి ముద్దతో పాటుగా మిగిలిన మసాలా పొడులు, కొద్దిగా రంగు, వెనిగర్ వేసి బాగా రుద్ది ముక్కలకి మసాలాలు పట్టించి, ఆఖరుగా కార్న్ ఫ్లోర్ వేసి కలిపి కోటింగ్ ఇచ్చి ముక్కలని కనీసం గంటసేపైనా ఫ్రిజ్లో ఊరనివ్వండి.
గంట తరువాత మరిగే వేడి నూనెలో ముక్కలన్ని ఒకే సారిగా అకాకుండా రెండు సగాలుగా విభజించి మీడియం మంట మీద ఎర్రగా వేపి తీసుకోండి.
టాసింగ్ కోసం కొద్దిగా నూనె వేడి చేసి, అందులో జీడిపప్పు మిగిలిన పదార్ధాలన్నీ వేసి హై ఫ్లేమ్ మీద జీడిపప్పు రంగు మారనివ్వండి.
రంగు మారిన జీడీఅప్పులో, వేపుకున్న చికెన్ ముక్కలు వెల్లులి పొడి వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి.