పాలక్ గార్లిక్ మష్రూమ్

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms పాలకూర ఆకు
  • 3 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 1 tsp పంచదార
  • 2 liters నీళ్ళు
  • కూర కోసం
  • 200 gms మష్రూమ్స్
  • 2 tbsp నూనె
  • 2 ఎండు మిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 2 tbsp వెల్లులి తరుగు (10 చిన్న వెల్లులి తరుగు)
  • 1/4 cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp కారం
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp కసూరి మేథి
  • 2 tbsp ఫ్రెష్ క్రీమ్
  • 125 ml నీళ్ళు
  • తాలింపు కోసం
  • 1 tbsp నెయ్యి
  • 2 ఎండు మిర్చి
  • 1 tbsp వెల్లులి

విధానం

  1. మరిగే నీళ్ళలో పాలకూర ఆకులు, పచ్చిమిర్చి ఉప్పు పంచదార వేసి ఒక పొంగురాగానే తీసి చల్లని నీళ్ళలో వేసి ఉంచండి.
  2. మరో గిన్నెలో మరిగే నీళ్ళలో ఉప్పు మష్రూమ్స్ వేసి 2 నిమిషాలు ఉడికించి తీసి చల్లని నీళ్ళలో వేసి ఉంచండి.
  3. పాన్లో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి వేసి వేపి జీలకర్ర చిటచిట అనేదాక వేపుకోవాలి
  4. వేగి జీలకర్రలో వెల్లులి తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుని ఉల్లిపాయ వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి
  5. వేగిన ఉల్లిలో ఉప్పు, పసుపు వేసి వేపుకోవాలి తరువాత పాలకూర పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక మూతపెట్టి మగ్గించాలి
  6. నూనె పైకి తేలాక కారం, గరం మసాలా, కసూరి మేథీ వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
  7. నీళ్ళు పోసి ఒక పొంగు రానివ్వాలి. తరువాత మష్రూమ్స్ వేసి నూనె పైకి తెలనివ్వాలి
  8. ఆఖరుగా క్రీమ్ వేసి కలిపి దింపేయండి
  9. పాన్లో నెయ్యి కరిగించి ఎండుమిర్చి వెల్లులి తరుగు వేసి ఎర్రగా వేపి కూర పైన పోసుకోవాలి
  10. ఈ పాలక్ మష్రూమ్స్ కర్రీ నాన్ రొటీలతో చాలా రుచిగా ఉంటుంది.