వెల్లులి చారు

Sambar - Rasam Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 12 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • 20 - 25 వెల్లులి (35 grams)
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 2 రెబ్బలు కరివేపాకు కాడలుతో సహా
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • 1 cup టొమాటో ముక్కలు
  • 1/2 cup చింతపండు రసం (50 గ్రాముల చింతపండు నుండి తీసినది)
  • 800 ml నీళ్ళు
  • 1.5 tsp నూనె
  • తాలింపు
  • 1 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/4 tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 2 రెబ్బలు కరివేపాకు
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 5 పొట్టుతో దంచిన వెల్లులి

విధానం

  1. మిరియాలు జీలకర్ర వెల్లులిని కచ్చా పచ్చగా దంచుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు రెబ్బలు కాడలతో సహా దంచిన వెల్లులి మిరియాల ముద్ద వేసి వెల్లులి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  3. వేగిన వెల్లులిలో టొమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి టొమాటోలని 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు.
  4. చింతపండు పులుసు పోసి 2-3 పొంగులు రానివ్వాలి. పొంగిన పులుసులో నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి మెత్తబడే దాకా మరిగించాలి, తరువాత దింపేయాలి. (చారు సాంబార్కి మల్లె ఎక్కువగా మరగకూడదు).
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామగ్రి అంతా ఒక్కోటిగా వేసుకుంటూ పొట్టుతో ఉన్న వెల్లులి ని ఎర్రగా వేపి దింపే ముందు కొత్తిమీర వేసి కలిపి చారులో పొసెయ్యండి. అంతే ఘుమఘుమలాడే చారు తయారు.