అల్లం నిమ్మకాయ చారు

Sambar - Rasam Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కందిపప్పు – పిడికెడు (30 నిమిషాలు నానబెట్టినవి)
  • 5 - 6 కరివేపాకు కాడలు
  • 1 టొమాటో
  • 1/8 tsp పసుపు
  • 1/2 liter నీళ్ళు
  • చారు పొడి కోసం
  • 1 tsp మిరియాలు
  • 1 ఇంచు అల్లం
  • 5 - 6 వెల్లులి
  • 1 tsp జీలకర్ర
  • చారు కోసం
  • రాళ్ళ ఉప్పు – రుచికి సరిపడా
  • 3 tbsp నిమ్మరసం
  • 1 కొత్తిమీర – చిన్న కట్ట
  • చారు తాలింపు కోసం
  • 1 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 2 చిటికెళ్లు మెంతులు
  • 2 ఎండు మిర్చి
  • 1 చిటికెడు ఇంగువ
  • 2 రెబ్బలు కరివేపాకు

విధానం

  1. కుక్కర్ లో నానబెట్టిన కందిపప్పు, పసుపు, టొమాటో, నీళ్ళు కరివేపాకు కాడలు నలిపి వేపి వేసి మెడియం ఫ్లేమ్ మీద నాలుగు విసిల్ రానివ్వాలి కుక్కర్ లో నానబెట్టిన కందిపప్పు, పసుపు, టొమాటో, నీళ్ళు కరివేపాకు కాడలు నలిపి వేపి వేసి మెడియం ఫ్లేమ్ మీద నాలుగు విసిల్ రానివ్వాలి
  2. ఆవిరిపోయాక పప్పుని మెత్తగా మెదుపుకోవాలి, తరువాత జల్లెడలో వేసి గరిటతో ఎనిపితే పప్పు మొత్తం దిగిపోతుంది
  3. మిక్సీలో చారు పొడికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి
  4. పప్పు నీళ్ళు గిన్నెలో పోసి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసి ఒక పొంగురానిచ్చి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోండి
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు మెంతులు వేసి చిటచిటలాడించి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసి వేపి చారులో కలుపుకుంటే ఘాటైన చారు రెడీ.