కాలీఫ్లవర్ కోటింగ్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్లతో చిక్కని ముద్ద చేసుకోండి.
చిక్కని పేస్ట్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసి నెమ్మదిగా కోటింగ్ పట్టించండి
కోట్ చేసుకున్న ముక్కలని మరిగె నూనెలో వేసి కేవలం మీడియం మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాయ్ ఫ్లేమ్లోకి పెట్టి కారకరలాడేట్టు వేపుకుని తీసుకోవాలి (పర్ఫెక్ట్గా కాలీఫ్లవర్ ఎలా వేపాలి టిప్స్ చుడండి).
నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కరివేపాకు వెల్లులి వేసి వేపుకోవాలి
వేగిన వెల్లులిలో ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపుకోవాలి
మెత్తబడిన ఉల్లిపాయలో అన్నం వేసి మిగిలిన సామానంతా వేసి హాయ్ ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి
దింపే ముందు ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి
దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.