నూనె వేడి చేసి ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రగా వేపుకోవాలి.
వేగిన మెంతులలో మినపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి వేపి తీసి మిక్సీలో సాధ్యమైనంత మెత్తగా పొడి చేసుకోండి.
అదే ముకుడులో నూనె వేడి చేసి అందులో మిరపకాయలు వేసి మూతపెట్టి సన్నని సెగమీద పచ్చిమిర్చిని మెత్తగా మగ్గనివాలి (ఇదే పచ్చడి చాలా తీరుల్లో చేసుకోవచ్చు వాటికోసం టిప్స్ చూడండి )
మగ్గిన మిర్చీని మిక్సీలో వేసుకోండి, అందులో చింతపండు గుజ్జు, బెల్లం ఉప్పు గ్రైండ్ చేసుకున్న తాలింపు వేసి నీళ్ళు వేయకుండా బరకగా రుబ్బుకోండి. ఈ పచ్చడి బయట 3 రోజులు ఫ్రిజ్లో 15 రోజులు నిలవ ఉంటుంది నీరు తగలకపోతే.