పెసలని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి. మాచి సువాసన రాగానే నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద అయిదు కూతలు వచ్చేదాక ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుంది.
ఉడికిన పప్పులో మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి కలుపుతూ బెల్లం కరిగి ముద్దగా అయ్యేదాక ఉడికించండి.
బాగా దగ్గర పడిన ముద్దని తీసి పూర్తిగా చల్లారచాలి.
బియ్యం పిండిలో ఉప్పు నీళ్ళు పోసి జారుగా కలుపుకోవాలి.
కలుపుకున్న పిండిని గట్టి ముద్ద అయ్యేదాక కలుపుతూ దగ్గర పడానివ్వాలి. దగ్గర పడ్డాక పూర్తిగా చల్లారచాలి.
విస్తరి ఆకులని నీళ్ళలో ఒక నిమిషం ఉంచి తీసుకోండి.
ఆకు పైన బొట్టు నెయ్యి రాసి నిమ్మకాయ సైజు బియ్యం పిండి ముద్ద తీసి పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆకు మీద. పిండి మధ్య ఉసిరికాయంత పప్పు ముద్ద ఉంచి ఆకు ఒక అంచును పట్టి మడిచి అంచులని నెమ్మదిగా తట్టాలి.
తరువాత మిగిలిన ఆకుని మరో మడత వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద 4 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకోవాలి.