పచ్చి జామకాయల్లోంచి గింజలు పూర్తిగా తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోండి.
నూనె వేడి చేసి అందులో వేరుశెనగగుండ్లు వేసి చిట్లనివ్వండి, ఆ తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి పొంగనివ్వండి.
తరువాత వేగిన పప్పు పచ్చిమిర్చి నానేసిన చింతపండు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి ఆ తరువాత పచ్చి జామకాయ ముక్కలు కొత్తిమీర వేసి బరకగా రుబ్బుకోండి.
నూనె వేడి చేసి ఆవాలు వేసి వాటిని చిట్లనివ్వండి. ఆ తరువాత సెనగపప్పు, మినపప్పు మరియు ఎండు మిరపకాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై దంచిన వెల్లుల్లి, ఇంగువ, పసుపు వేసి కలపాలి.
నూనె వేడి చేసి తాలింపు సామాగ్రీ అంతా వేసి ఎర్రంగా వేపి అందులో బరకగా రుబ్బుకున్న జామకాయ పచ్చడి వేసి కలిపి ఒక్క నిమిషం మగ్గించి దింపేసుకోండి.
జామకాయ పచ్చడి నెయ్యి వేసిన వేడి అన్నం తో ఎంతో గొప్పగా ఉంటుంది.