హర్యాలీ వెజ్ ధం బిర్యానీ

Biryanis | vegetarian

  • Prep Time 7 Mins
  • Cook Time 45 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • హర్యాలీ పేస్ట్ కోసం
  • 50 gm కొత్తిమీర
  • 50 gm పుదీనా
  • 4 - 5 పచ్చిమిర్చి
  • 1/2 ఇంచ్ అల్లం
  • 6 - 7 వెల్లులి
  • 1/2 cup పెరుగు
  • 1 tbsp నిమ్మరసం
  • బిర్యానీ కోసం
  • 2 tbsp నూనె
  • 2 tbsp నెయ్యి
  • బిర్యానీ మసాలా
  • 1/2 tsp మిరియాలు
  • 1 tsp షాహీ జీరా
  • 1.5 ఇంచ్ దాల్చిన చెక్క
  • 6 యాలకలు
  • 5 లవంగాలు
  • 1 నల్ల యాలక
  • 1 జాపత్రి
  • 1 అనాస పువ్వు
  • 1 మరాటి మొగ్గ
  • 1 బిర్యానీ ఆకు
  • కూరగాయలు
  • 1 ఉల్లిపాయ చీలికలు
  • 1/4 cup ఆలూ
  • 15 - 20 కాలీఫ్లవర్ ముక్కలు
  • 4 ఫ్రెంచ్ బీన్స్
  • 1/2 cup కేరట్ ముక్కలు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • పొడి మసాలా
  • 1/2 tsp పసుపు
  • 1 tsp యాలకల పొడి
  • 1 tsp గరం మసాలా
  • 1.5 tsp కారం
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 cup బటానీ
  • 1/2 cup పెరుగు
  • 1 tsp నిమ్మరసం
  • బిర్యానీ రైస్ వండడానికి
  • 2 liter నీళ్ళు
  • 2 పచ్చిమిర్చి
  • 2.5 tbsp ఉప్పు
  • 5 లవంగాలు
  • 1 బిర్యానీ ఆకు
  • 1 tbsp షాహీ జీరా
  • 6 యాలకలు
  • 1 మరాటీ మొగ్గ
  • 1 జాపత్రి
  • 1.5 ఇంచ్ దాల్చిన చెక్క
  • 2 cups నానబెట్టిన బాస్మతి బియ్యం (370 gm)
  • 1 tsp కేసర్ ఫుడ్ కలర్
  • 1/4 tsp గరం మసాలా
  • 2 tsp నెయ్యి

విధానం

  1. హర్యాలీ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి చల్లని నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. బిర్యానీ వండే పాత్రలో నెయ్యి నూనె వేసి వేడి చేసి పొడి బిర్యానీ మసాలా అంతా వేసి వేపుకోవాలి.
  3. వేగిన మసాలాలో ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడే దాకా వేపుకోవాలి. తరువాత మిగిలిన కూరగాయాలన్నీ వేసి 60% వేగనివ్వాలి
  4. వేగినా కూరగాయాల్లో ఉప్పు మిగిలిన పొడి మసాలాలు (కారం గరం మసాలా ఇంకా..)వేసి వేపుకోవాలి, ఆ తరువాత స్టవ్ ఆపేయండి.
  5. స్టవ్ ఆపేసిన తరువాత హర్యాలీ పేస్ట్, ఫ్రొజెన్ బటానీ, పెరుగు, నిమ్మరసం, tbsp నెయ్యి, నూనె వేసి బాగా కలుపుకోవాలి.
  6. బిర్యానీ రైస్ వండుకోడానికి మరిగే నీళ్ళలో మసాలా దినుసులు ఉప్పు అన్నీ వేసి మరగ కాగనివ్వాలి 3-4 నిమిషాలు.
  7. మరుగుతున్న ఎసరులో నానబెట్టిన బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద 80% ఉడికించుకోవాలి.
  8. 80% ఉడికిన అన్నాన్ని వడకట్టి బిర్యానీ కోసం మసాలాలు కలిపి ఉంచిన కూరగాయల మీద వేసుకోవాలి.
  9. అన్నం అంతా వేశాక పైన కొద్దిగా గరం మసాలా నెయ్యి బిర్యానీ రైస్ ఉడికించుకున్న నీళ్ళు ½ కప్పు అన్నం అంతా పోసుకోవాలి ఒకే దగ్గర కాకుండా. ఇంకా కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా.
  10. బిర్యానీ గిన్నె అంచులకి మైదా పిండి ముద్ద పెట్టి ఒక దగ్గర కొంచెం ఖాళీ వదిలి ధం బయటకి పోకుండా మూత బిగించి పెట్టాలి.
  11. ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే స్టీమ్ ఖాళీ వదిలిన చోట నుండి వేగంగా తన్నుకు వస్తుంది. అప్పుడు మంట తగ్గించి లో-ఫ్లేమ్లోకి తగ్గించి మీద 8 నిమిషాలు ఉడికించి, తరువాత స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయండి.
  12. 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తరువాత మూత తీసి ఘుమఘుమలాడే బిర్యానీ చల్లని రైతాతో ఎంజాయ్ చేయండి.