మునగాకు రైస్

Flavored Rice | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • మునగాకు పొడి కోసం
  • 1 tbsp ధనియాలు
  • 1 tbsp నువ్వులు
  • 1 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 5 వెల్లులి
  • 50 gm మునగాకు
  • తాలింపు కోసం
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 2 ఎండుమిర్చి
  • 1 tsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 10 జీడిపప్పు
  • 4 దంచిన వెల్లులి
  • ఉప్పు
  • 1/4 cup పొడి పొడిగా వండుకున్న అన్నం (1 కప్ అంటే 185 గ్రాములు)
  • 1 tsp మిరియాల పొడి

విధానం

  1. మూకుడులో తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపుకోవాలి.
  2. వేగిన పప్పులలో మునగాకు వేసి ఆకులోని చెమ్మ ఆరిపోయేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఆకులో చెమ్మ ఆరిన తరువాత వెల్లులి వేసి వేపుకోవాలి.
  3. వేగిన పప్పులు ఆకు అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.
  4. తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి ఎర్రగా వేపి ఉడికించిని అన్నం ఉప్పు మునగాకు పొడి వేసి హాయ్ ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి.
  5. దింపే ముందు మిరియాల పొడి వేసి టాస్ చేసి దింపేసుకోవాలి.