నీళ్ళు మరిగించుకుని అందులో కేవలం సన్నగా తరుక్కున్న పాలకూర ఆకులు మాత్రమే వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోండి.
మిక్సీ జార్లో ఉడికిన్చుకున్న పాలకూర, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్టు చేసుకోండి.
గోధుమ పిండి లో ఉప్పు, పాలకూర పేస్టు, వేసి బాగా కలుపుకుని, కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కనీసం 5-6 నిమిషాలు పైన పగుళ్లు లేని పిండిముద్దగా వత్తుకోవాలి.
పిండి సాఫ్ట్ గా ఉండాలి. బాగా వత్తుకున్నాక తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి.
30 నిమిషాల తరువాత మళ్ళీ వత్తుకుని చిన్న బాల్స్ గా చేసుకుని పిండి చల్లుకుని రోటీలు వత్తుకోండి.
వత్తుకున్న వాటిని వేడి వేడి పెనం మీద వేసి రెండు వైపులా 1 నిమిషం పాటు కాల్చుకోండి.
రెండు వైపులా కాస్త కాలినట్లు కనపడగానే వెంటనే గ్యాస్ మీద ఓ గ్రిల్ పెట్టి మీడియం ఫ్లేం మీద కాల్చుకోండి వెంటనే పొంగుతుంది, ఆ తరువాత తిప్పి మళ్ళీ కాల్చుకోండి మళ్ళీ పొంగుతుంది.
రోటీలు వేడి మీదే రెండు చుక్కలు నెయ్యి వేసి రుద్దితే చాలా బావుంటాయీ. చాలా సాఫ్ట్ గా ఉంటాయి
నెయ్యి వొద్దనుకున్న వారు కాటన్ బట్టలో కప్పి ఉంచితే గంటల తరువాత కూడా మృదువుగా ఉంటాయ్.